|
హైదరాబాద్‌తో కలిసి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 2014 ఎన్నికలు జరుగుతాయని ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి బస్వరాజు సారయ్య వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 14(ఎఫ్) తొలగించినప్పుడే ప్రత్యేక రాష్ట్రానికి అడ్డంకులు లేవని బయటపడిందన్నారు. రాష్ట్రం విడిపోవడం ఖాయం అని స్పష్టమైంది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని తెలిపారు. రచ్చబండను విజయవంతం చేయాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ మాజీ మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరింది. కొమటిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని పరిక్షించిన వైద్యులు ఆయన శరీరంలో బీపీ, షుగర్, పొటాషియం స్థాయి తగ్గినట్లు వెల్లడించారు. కొమటిరెడ్డికి వైద్యం అందించకపోతే ప్రమాదమని వైద్యులు తెలిపారు. మండలాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు ఇక్కడ ధర్నా నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేశారు. తాసీల్దారు కార్యాలయాన్ని ముట్టడించారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందించాలని డిమాండ్ చేశారు. పంట రుణాలు ఇవ్వాలని తాసీల్దారుకు వినతి పత్రం ఇచ్చారు. పెంచిన పెట్రోలు ధరలు తగ్గించాలని, రైతులకు గిట్టుబాటు ధరలు అందించాలని, ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చూస్తూ తెలుగుదేశం పార్టీ మండల నాయకులు ఇక్కడ ధర్నా నిర్వహించారు. అనంతరం తాసీల్దారుకు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు శంకరయ్య, కృష్ణయ్య, శ్రీనివాస్ నాయకత్వం వహించారు. గిట్టుబాటుధర కల్పించాలని కోరుతూ రైతులు తాశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ముందే పంటలు ఎండిపోయి నానా ఇబ్బందులు పడుతున్నామని దానికి తోడు ధరలు లేకపోతే ఎలా బతకాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలు ఇవ్వాలని కోరుతూ తాశీల్దారు సంగీతకు వినతిపత్రం అందజేశారు. మధ్యాహ్న భోజనం కావాలంటూ తొర్రూరులోని జడ్పీ స్కూలు విద్యార్థులు రాస్తారోకో చేశారు. కమిటీ సభ్యులు గొడవపడి విద్యార్థులకు భోజనం పెట్టలేదు. ఆకలికి తాళలేని విద్యార్థులు రాస్తారోకో చేశారు. కురవి మండలం రాజోల్ గ్రామానికి చెందిన కొప్పుల వెంకట్‌రెడ్డి(40) అనే వ్యక్తి డెంగీ జ్వరంతో మృతి చెందాడు. ఈయనకు నాలుగు రోజుల క్రితం జ్వరం రావటంతో శుక్రవారం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లిన ప్రయోజనం లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. |
|
|